నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17 ( షేక్ గౌస్)
భీంగల్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేసిన విమర్శలు అర్ధ రహితమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో ప్రశాంత్ రెడ్డి కావాలని రాద్ధాంతం చేయడాన్ని ఖండించారు.
ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై పెరుగుతున్న ఆధారణ చూసి ప్రశాంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల కింద లబ్ధిదారులకు తులం బంగారం త్వరలో అందిస్తామన్నారు.గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోయిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయ ప్రవర్తనలో బాధ్యత ఉండాలని సూచించారు.