నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే ;18
జిజిహెచ్ ఆస్పత్రి, నిజామాబాదు ఆవరణలో ఆదివారం సాయంత్రం క్యాండిల్ లైట్ డే నిర్వహించారు. హెచ్ఐవి, ఎయిడ్స్ బారిన పడి చనిపోయిన బాధితుల స్మారకార్థం సందర్భంగా ప్రతి ఏటా మే నెల మూడవ ఆదివారం క్యాండిల్ లైట్ డే నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆసుపత్రి ఆవరణలో కొవ్వొత్తుల ను వెలిగించి ర్యాలీ ని డాక్టర్ అవంతి, డాక్టర్ భార్గవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆస్పత్రి నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ కొనసాగించారు. హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడి చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని వారు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో, డి పి ఎం సుధాకర్, సి ఎస్ ఓ నవీన్ టిబి కోఆర్డినేటర్ రవి, పాజిటివ్ నెట్వర్క్, స్నేహ సొసైటీ,, వై ఆర్ జి ఎల్ డబ్ల్యూ ఎస్, వర్డ్ ఎన్జీవో, డిఎం అండ్ హాస్పిటల్ సిబ్బంది, డి ఏ పి యు సి మరియు టిబి సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బంది,