మహిళలు అన్ని రంగాల్లో ముందుకు ప్రయాణించాలి.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7.
మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో ముందుకు రావాలని ప్రతిభను కనబడుచాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత తెలిపారు. ఈరోజు నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని దానికి అనుగుణంగా మహిళలు ఉన్నత చదువులు చదువుకొని శక్తివంతులై అన్ని రంగాల్లో ముందుకు రావాలని అన్నారు. మహిళల ఆత్మ రక్షణ కోసం కరాటే లాంటి శిక్షణ తీసుకోవాలని జ్ఞానాన్ని పొందాలని సమాజంలో మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు, అత్యాచారాలు నివారణకై చట్టాల మీద అవగాహన పొందాలని తెలిపారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి కనకదుర్గ గారు, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఆశా లత, రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్, డిఎల్ఎస్ఎ సెక్రటరీ పద్మావతి, న్యాయమూర్తులు కుష్బూ ఉపాధ్యాయ, చైతన్య బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ ప్రధాన కార్యదర్శి వసంతరావు ట్రెజరర్ దీపక్ లైబ్రరీ సెక్రటరీ పిల్లి శ్రీకాంత్ మహిళా న్యాయవాదులు కవితా రెడ్డి, నీరజ, పరిపూర్ణా రెడ్డి, రజిత, మానస, అపూర్వ, రమ, కల్పన, స్నేహ, అంజలి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!