నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 ( షేక్ గౌస్)
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని హైకోర్టు న్యాయవాది రఘునాథ్ పేర్కొన్నారు. నిజామాబాద్‌లో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి లహరి హోటల్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో చేర్చడం చట్టవిరుద్ధమని స్పష్టంగా పేర్కొన్నదన్నారు. అలాగే, వక్ఫ్ బైయూజర్ల హక్కులను తొలగించడం అన్యాయం అని అన్నారు. వక్ఫ్ ఆస్తులు ముస్లింల మత, సామాజిక అవసరాల నిమిత్తమే ఉండాలని తెలిపారు.
ఈ సమావేశానికి బీజేపీ మినహా ఇతర ప్రధాన రాజకీయ పార్టీలు జేఏసీ స్థానానికి మద్దతు తెలిపాయి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని, ముస్లింల హక్కులను రక్షించాలన్న డిమాండ్లు విస్తృతంగా వినిపించాయి.