నిజామాబాద్ జై భారత్ జూలై 19 : వుషు స్పోర్ట్స్ తెలంగాణ అసోసియేషన్ జనరల్ బాడీ ఎన్నికలు శనివారం 2025-2029 ఏకగ్రీవంగ జరిగాయి. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్మోహన్ మాట్లాడుతూ మైనారిటీలో కానీ మెజారిటీలో కానీ స్పోర్ట్స్ లో ఎదగాలని పిలుపునిచ్చారు. ఏకగ్రీవంగా వుషు అసోసియేషన్ ప్రెసిడెంట్ కావడం సంతోషం వ్యక్తం చేశారు.త్వరలో అకాడమీ తెరుస్తామని హామీ ఇచ్చారు. తన పరంగా కానీ ప్రభుత్వ పరంగా అసోసియేషన్ కి మద్దతు ఇస్తూ పిల్లల భవిష్యత్తు తీర్చి దిద్దుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల అబ్జర్వర్ ఆఫీసర్లుగా మహమ్మద్ మషీ ఇమ్రాన్ వుషు అసోసియేషన్ తెలంగాణ, ప్రశాంత్ డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ నిజామాబాద్, బొబ్బిలి నరసయ్య నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఒలంపిక్ అసోసియేషన్, రిటర్నింగ్ ఆఫీసర్ గా విశ్వక్ సేన్ రాజ్ లు వ్యవహరించారు. ప్రెసిడెంట్ గా బాజిరెడ్డి జగన్మోహన్, వైస్ ప్రెసిడెంట్స్ గా బాజిరెడ్డి రమాకాంత్, షేక్ జావిద్, మహమ్మద్ షాబుద్దీన్,షేక్ రఫీ ఉద్దీన్, జనరల్ సెక్రెటరీ గా ఎం డి ఇర్ఫాన్, ట్రెజరర్ గా షేక్ తబ్రీజ్, జాయింట్ సెక్రటరీలుగా రానా తబస్సం, వసీం, ఎండి ఫక్రుద్దీన్, అబ్దుల్ మజీద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా షేక్ అహ్మద్ పాషా, మహమ్మద్ ఇమ్రాన్, సయ్యద్ జునియాద్, షేక్ ఫహీంలు ఎన్నికయ్యారు.
వుషు స్పోర్ట్స్ తెలంగాణ అసోసియేషన్ జనరల్ బాడీ ఎన్నికలు(2025-29) ఏకగ్రీవం.
Published On: July 20, 2025 12:17 am
