ప్రసన్నహరికృష్ణ, సాయన్న లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి..

నిజామాబాద్ ప్రతినిథి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 16.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఐక్యతే బీఎస్పీ లక్ష్యం…బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్..
రాష్ట్ర విధాన సభ కు ఎంపిక చేసుకునే అభ్యర్థులు కీలక చట్టాలు చేయడంలో కీలక భూమిక ఉంటుందని, కాబట్టి నిష్ణాతులైన వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బీఎస్పీ అభ్యర్ధులను గెలిపించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన ఓ ప్రైవేట్ హోటల్ లో మీడియాతో మాట్లాడారు. బీఎస్పీ పార్టీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ కి పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణ, ఉపాద్యాయ ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న సాయన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టభద్రులు లను, ఉపాధ్యాయులను కోరారు. ఆయా రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారు పక్కగా వ్యాపారాలను కాపాడుకోవడానికి పోటీ చేస్తున్నారని, విద్యార్థులకు కనీస ఫీజును తగ్గించలేని వారు ఇప్పుడు పోటీ చేయడం వెనక ఆంతర్యం ఏమిటో గుర్తించాలని తెలిపారు. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణ ప్రత్యేకంగా నిరుద్యోగ నిర్మూలన కోసం కృషి చేశారని ఎమ్మెల్సీ అయితే నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఎంతో కృషి చేస్తారని అన్నారు. నిజాయితీగా ఉపాద్యాయ వృత్తికి న్యాయం చేస్తూ, ఉపాద్యాయ సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అలాగే ఓల్డ్ పెన్షన్ విధానం రావాలంటే సాయన్న ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మరోవైపు విద్యను పూర్తిగా ప్రైవేటుకరణ చేసే దిశలో రాజకీయ పార్టీల ఉన్నాయని తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టి బీసీ లను అది నుంచి అన్యాయం చేస్తుందని అన్నారు. మొదటి నుంచి ఎన్నో కమిషన్లు చేసిన వాటి నివేదికలను బయటకు తీయకుండా తొక్కి పెట్టిందని చెప్పారు. కాన్షిరాం ఆధ్వర్యంలో మండల్ కమిషన్ కోసం ఉద్యమించి బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు తీసుకు వచ్చారని అన్నారు. కమండల్ కమిషన్ అంటూ బిజెపి మండల కమిషన్ కు వ్యతిరేకంగా పని చేసిందని అన్నారు. ఇలా కీలక రాజకీయ పార్టీల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు లేకుండా కుట్ర చేస్తుందని అన్నారు. దేశంలో పేరు మోసిన విద్య సంస్థలలో అగ్రవర్ణ కులాల ఉద్యోగులే అత్యధిక సంఖ్యలో ఉన్నాయని ఇటీవల ఆర్ టీ ఐ ద్వారా ఈ ఇషయం వెలుగులోకి వచ్చిందని అన్నారు. కాన్షీరాం ఇచ్చిన నినాదం ” ఎవరు ఎంతో వారికి అంత వాటా” ప్రకారమే ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయని అన్నారు. అగ్ర కులలో పేదలు ఉన్నారని, వారికి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని బి ఎస్ పి మద్దతు ఇస్తుందని అన్నారు. బీసీ బిడ్డలైన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, ఉపాద్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి యాతకర సాయన్న లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు..

Join WhatsApp

Join Now

Leave a Comment