హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్మూర్ లో వినయ్ కుమార్ రెడ్డి పూజలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:12 (షేక్ గౌస్)
ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని వివిధ హనుమాన్ మందిరాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మామిడిపల్లి, కొటార్మూర్ (శివాలయం), జంబి, మీది బజార్ కాశీ హనుమాన్ మందిరం, లాలిగడి, సిద్ధులగుట్ట, హౌసింగ్ బోర్డ్ కాలనీ వంటి ప్రాంతాల్లో ఉన్న హనుమాన్ మందిరాల్లో ఆయన అర్చనలు చేసి స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలయాల వద్ద భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment