నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:21 ( షేక్ గౌస్)
లోక్‌సభ ఎన్నికల కోడ్ లో భాగంగా నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు తాత్కాలికంగా బదిలీ అయిన నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు తహసీల్దార్లు తిరిగి తమ పూర్వ జిల్లా నిజామాబాద్‌కు చేరుకున్నారు.జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారి ఆధ్వర్యంలో బుధవారం ఉత్తర్వులు జారీ చేసి, ఈ తహసీల్దార్లకు మండలాల వారీగా కొత్త పోస్టింగ్‌లు కేటాయించారు. జిల్లా పరిపాలన సాఫీగా సాగేందుకు వీరికి మళ్లీ బాధ్యతలు అప్పగించారు ఈ క్రమంలో, నిర్మల్ నుండి నిజామాబాద్‌కు బదిలీ వచ్చిన నాయబ్ తహసీల్దార్ శ్రీ వి. గంగాధర్ కి మంగళవారం మరియు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఘన సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో అన్ని సహాయ ఎన్నికల నమోదు అధికారులు (AEROs) మరియు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని గంగాధర్ సేవలను ప్రశంసించారు. నిజామాబాద్‌లో గతంలో నిర్వహించిన అనుభవాలను గుర్తుచేసుకుని తిరిగి జిల్లాలో పనిచేసే అవకాశం కలగడం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
పోస్టింగ్‌లు పొందిన తహసీల్దారుల వివరాలు:1. ఎల్. వీర్ సింగ్ – చందూర్,2. సతీష్ రెడ్డి – డిచ్‌పల్లి 3. ప్రసాద్ కమ్మర్పల్లి ,4. శాంత – ధర్పల్లి ,5. శ్రీనివాస్ – వేల్పూర్ ,6. ముంతాజ్‌బుద్దీన్ – ముప్కాల్,7. వెంకటేశం – ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయం,8. ధన్వాల్ – కలెక్టరేట్ సూపరింటెండెంట్