నగరంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో పాల్గొన్న అర్బన్ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : నిజామాబాద్ నగర అభివృద్ధి దిశగా మరో ముందడుగు! ఈ రోజు నగరంలోని పలు ప్రాంతాలలో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పాల్గొని శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) చైర్మన్ కేశవ్ వేణు హాజరయ్యారు.ఈ అభివృద్ధి పనుల కోసం అవసరమైన నిధులను నుడా (నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ద్వారా కేటాయించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “ప్రజల ఆశయాలు నెరవేర్చడం, నగరంలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం నా ధ్యేయం. ప్రతి వార్డు, ప్రతి వీధిలో మౌలిక వసతులు అందించడమే నా లక్ష్యం. ఇందూరు నగరం లో డ్రెయిన్ లేకపోవడం, రోడ్లు బాగాలేకపోవడం వంటి సమస్యలు ఉండకూడదు. అభివృద్ధి కోసం శంకుస్థాపన చేసిన ప్రధాన పనులు ఇవీ, గౌతమ్ నగర్, ఉర్దూ పాఠశాల సమీపంలో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పనులు అమ్మా వెంచర్ బ్రిడ్జ్ సమీపం, యెల్లమ్మ గుట్టలో సి. సి. రోడ్ పనులు రేడియో స్టేషన్ సమీపం, న్యాల్కల్ రోడ్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ మరియు సీసీ రోడ్ పనులు ఉర్దూ గర్ల్స్ జూనియర్ కాలేజ్, మలపల్లిలో కాలేజ్ అభివృద్ధి పనులు ధర్మపురి హిల్స్, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పనులు హబీబ్ నగర్, బోధన్ రోడ్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పనులు తీన్ కమాన్, నిజాం కాలనీ, అర్సాపల్లి ప్రాంతాలలో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పనులు ఎమ్మెల్యే మరోసారి స్పష్టం చేశారు.“ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నిజామాబాద్ నగరాన్ని మరింత శుభ్రమైన, సుందరమైన, ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే నా కల. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం కోసం వినియోగించబడుతుంది. ప్రతి కుటుంబానికి నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందే వరకు నేను విశ్రాంతి తీసుకోను” అని అన్నారు.ఈ కార్యక్రమాలలో నగరంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే ని అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment