మహిళా క్రీడాకారుల పట్టుదల, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 : (నవీన్ కుమార్) నిజామాబాద్ రాష్ట్ర స్థాయి మహిళా వుశు లీగ్ 2025 – ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త అభినందనలు తెలియజేశారు.నిజామాబాద్ జిల్లా, ఫూల్లాంగ్ క్రాస్ రోడ్, టిటిడి కల్యాణ మండపం లో 26వ అక్టోబర్ 2025న ఘనంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహిళా వుశు లీగ్ 2025 కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పాల్గొని క్రీడాకారులను అభినందించారు.ఈ పోటీలు సబ్-జూనియర్ మరియు జూనియర్ విభాగాల్లో మహిళా క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ నరేంద్ర మోడీ 2018లో ఖే్లో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాతే అందరూ ఆటలవైపు మొగ్గు చూపుతున్నారని మరీ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ ఆటల పోటీలలో పాల్గొడానికి ఆసక్తి కనబరుస్తున్నారు అని గుర్తు చేశారు.మహిళా క్రీడాకారుల పట్టుదల, కృషి మరియు క్రీడా ప్రతిభ అద్భుతం. ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు యువతలో శారీరక, మానసిక, సామాజిక సామర్థ్యాలను పెంపొందిస్తాయి. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆశిస్తున్నా.క్రీడాకారులు, నిర్వాహకులు సమిష్టి కృషి వల్ల ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ లీగ్ తెలంగాణ యువతకు క్రీడా రంగంలో అవకాశాలు, ప్రేరణను అందించే వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment