నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 16 : నిజామాబాద్ నగరంలోని గుమస్తా కాలనీలో దుర్గాదేవి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ,నూడా చైర్మన్ కేశ వేణు, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, 16వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ పంచ రెడ్డి ప్రవళిక శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ “దుర్గాదేవి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తాను. ఎమ్మెల్యే నిధుల నుండి రూ.5 లక్షలు, నా ట్రస్ట్ ద్వారా మరో రూ.1 లక్ష ఆలయానికి అందజేస్తాను” అని హామీ ఇచ్చారు. ఆలయంలో నిత్యపూజా కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. రాబోయే నవరాత్రులలో అమ్మవారి కార్యక్రమాల బ్రహ్మాండంగా జరగాలన్నారు ఈ అమ్మవారు చాలా మహిమగలదన్నారు నగర ప్రజలు ఒకసారి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరారు. చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో కమిటీ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటా అన్నరు ప్రభుత్వం నుంచి ఎటువంటి అవసరం ఉన్న నా వంతుగా ప్రయత్నం చేసి ఆలయ అభివృద్ధిలో భాగస్వామి అవుతానని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ ఇంత గొప్ప ఆలయం మన ఇందూరు నగరంలో ఉండటం అదృష్టం.కొత్త కమిటీ సనాతన ధర్మ పరిరక్షణలో భాగస్వాములై ఆలయాభివృద్ధికి కృషి చేయాలి”అన్నారు.కార్పొరేటర్ పంచ రెడ్డి ప్రవళిక శ్రీధర్ మాట్లాడుతూ, ఈ ఆలయానికి బోర్ వేయించడం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తుచేసి, భవిష్యత్తులో కూడా తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. నూతన కమిటీ అధ్యక్షుడు అమందు విజయ్ కృష్ణ మాట్లాడుతూ ఈ బాధ్యత నాకు అప్పగించిన గుమస్తా సంఘ సభ్యులకు ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాను” అని తెలిపారు. అభివృద్ధి విషయం లో అందరిని కలుపుకొని ముందుకు నడుస్తాను అని అన్నారు.ఇందూరు ప్రజలు ఒక్కసారి అమ్మవారిని దర్శించాలని తెలియచేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బోడికే బాబురావు, కోశాధికారి ధాత్రిక సదశివ, వేణుగోపాల్,లవంగ గౌరవాధ్యక్షులు జై మల్లేష్ యాదవ్, ఆకుల సందీప్, ఉపాధ్యక్షులు మడూరి కిషన్, గంగోని సంతోష్, గంగోని అనిల్, కార్యదర్శులు అమందు వెంకటేష్, అమందు రాజేష్, కార్యవర్గ సభ్యులు అజ్జన్ దుబ్బయ్య, నిచ్చెంగా దానాజీ, గంగోని ఉషాన్న, గంగోని సంతోష్, గంగోని శ్రీనివాస్, ధాత్రిక ప్రవీణ్, మైపాల్ రెడ్డి, పండ్రావీసం హరీష్, గౌరవ సలహాదారులు ధాత్రిక రాజేందర్, ధాత్రిక భీమన్న తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో నూతన కమిటీని పలువురు అభినందించారు. కాలనీవాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
దుర్గదేవి ఆలయానికి అన్ని విధాల సహకరిస్తాం – అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త.
Published On: August 16, 2025 10:17 pm











