జిల్లాలో 31వ తేదీ నుంచి ‘యూనిటీ మార్చ్– ఎంపీ అర్వింద్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ : 28 (నవీన్ కుమార్) సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని ఎంపీ అర్వింద్ కోరారు. నగంరంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఆయన మంగళవారం మాట్లాడారు.భారత యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 31 నుంచి నవంబర్ 25వ తేదీ వరకు జిల్లాలో యూనిటీ మార్చ్ నిర్వహించనున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.దేశాభివృద్ధిలో పటేల్ కీలకపాత్ర..ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పటేల్ దేశాభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రధానంగా దేశంలోని 500కు పైగా సంస్థానాలను విలీనం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. అయితే హైదరాబాద్ మాత్రం విలీనం కాలేదని దీంతో ‘ఆపరేషన్ పోలో’కు నడుం బిగించారని గుర్తు చేశారు. ఐదు రోజుల పోరాటంలో నిజాం లొంగిపోయాడన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment