48 గంటల్లో నే కేసు ఛేదించిన వన్ టౌన్ ఎస్సై జి.మహేష్ మరియు పోలీసులు సిబ్బంది.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక దినపత్రిక నవంబర్ 02 : దొంగలించిన సొమ్మును విక్రయించేందుకుయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వన్ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం. నగరంలోని కోజా కాలనీకి చెందిన అతర్ బైగ్ (21), షేక్ అజ్మాద్ (24) చెడు అలవాట్లకు బానిసలుగా మారారు. ఈ క్రమంలో జల్పాలకు డబ్బు సరిపోవడం లేదని ఒంటరిగా కనిపించిన వారిని బెదిరించి దారి దోపిడీకి పాల్పడడం. ఇళ్లలో చోరీలకు పాల్పడేవారు. ఇందులో భాగంగానే గత నెల 31న ఎరుకలవాడలోని ఓ ఇంట్లో బీరువా పగులగొట్టి బంగారు ఆభరణాలు, నగదు, సెల్ ఫోన్ అపహరించుకుని పారిపోయారు. చోరీ సొత్తును అమ్మేందుకు ఆదివారం గంజ్ మార్కెట్ లోఅనుమానాస్పదం గా తిరుగుతూ కనిపించారు. దీంతో పోలీసులు వారిని పట్టుకుని వారి వద్ద ” నుంచి బంగారు ముక్కు పుడక, ఉంగరం, వెండి కడియాలు, ఒత్తులు, స్మార్ట్ ఫోన్, రూ.1500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై ఇదివరకే చోరీ, హత్యాయత్నం కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. అతర్ బైగ్ నెలన్నర క్రితమే జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా… కేసును ఛేదించడంలో ముఖ్య పాత్ర వహించిన వన్ టౌన్ ఎస్సై జి.మహేష్, ఏఎస్సై షకీల్, కానిస్టేబుల్ గంగారాం, ప్రభురాజ్ లను ఏసిపీ రాజా వెంకట్ రెడ్డి అభినందించారు.









