జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 02 : తేదీ 29 జనవరి నాడు ఎ.ఆర్.పి క్యాంపు శివారులో గల D-46/8 నిజాంసాగర్ కెనాల్ లో గుర్తుతెలియని 6 సం,, ల చిన్నారి పాప మృతదేహం దొరికిందని గ్రామస్తుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి హుటాహుటిన శ్రీనివాస్ ఏసీపీ , బోధన్ గారి ఆద్వర్యంలో పోలీస్ సిబ్బందిని 3 టీములుగా చేసి పాప ఆచూకీ కోసం అన్నీ సోషల్ మీడియా మరియు ప్రింట్ మీడియా మరియు అన్నీ వాట్సాప్ గ్రూపులలో పాప ఆచూకీ కోసం పంపించడం జరిగినది. సుధీర్ PC-630 వాట్సాప్ స్టేటస్ ను అతని బందువులు అయిన ముఖేడ్ (మహారాష్ట్ర) గ్రామస్తులు చూసి అట్టి పాప ముఖేడ్ గ్రామానికి చెందిన ప్రాచి కొండమంగలే అని తెలిపినారు. దాంతో పోలీస్ టీం అట్టి గ్రామానికి వెళ్ళి మృతి చెందిన పాప అట్టి గ్రామానికి చెందినదే అని నిర్దారణ చేయడమైనది. ఈ కేసు యొక్క వివరాలు మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు.కెరుర్ గ్రామం, ముఖేడ్ తాలూకా కి చెందిన కొండమంగలే పాండురంగ అతని భార్య మరియు ముగ్గురు పిల్లలతో కలిసి విరాట్ సలూన్ పేరుతో ముఖేడ్ లో మంగలి పని చేస్తూ జీవిస్తున్నాడు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో కెరుర్ గ్రామ సర్పంచ్ గా పోటీ చేయాలనే ఉద్దేశం తో ప్రస్తుత సర్పంచ్ షిండే గణేష్ తో కలిసి ఎన్నికలలో పోటీ చేయాలంటే ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హులు అవుతారని దానికి గాను ముగ్గురు పిల్లలలో బాబు ని ఎవరికైనా దత్తత ఇవ్వాలని అనుకున్నారు కానీ అప్పటికే అతని పేరు మీద బర్త్ సర్టిఫికేట్ ఉంది అని నిర్దారించుకున్నారు, దీనికి గాను పూణే కార్పొరేషన్ ఆఫీసు వెళ్ళి బర్త్ సర్టిఫికటే మార్చాలని ప్రయత్నం చేశారు కానీ బర్త్ సర్టిఫికటే మారదు అని తెలిసిన తరువాత ఇద్దరు కలిసి పథకం వేసి ముగ్గురు పిల్లలలో ఒకరిని చంపేసి తప్పి పోయినట్లు చెప్పలని అనుకున్నారు. అందులో బాగంగానే పెద్ద కూతురు ప్రాచీ ని అతని తండ్రి తన బైక్ పై మాయ మాటలు చెప్పి నిజామాబాద్ తీసుకు వచ్చి మార్గ మద్యలో D-46/8 నిజాం సాగర్ కెనాల్, ఎడపల్లి యందు బ్రతికి ఉండగానే అట్టి కాలువలో తోసివేసినాడు.ఇట్టి కేసులో చాకచక్యంగా కేసును ఛేదించినందు లకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్.విజయ్ బాబు బోధన్ రూరల్ సి.ఐ. పోలీస్, శ్రీమతి ముత్యాల రమ SI ఎడపల్లి,K చంద్రమోహన్, SI రెంజల్, బాబు రావు, ASI, సుదీర్ PC మరియు శ్రీకాంత్ PC లను అబినందించినారు.
చిన్నారి (ప్రాచి) హత్య కేసులో ఇద్దరి నిందితుల అరెస్ట్ .
Updated On: February 2, 2026 3:07 pm









