ఎన్నికల నియమావళీ ప్రకారం విధులు నిర్వహించలి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 11.
 అధికారులకు దిశా _ “నిర్దేశం” చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తిగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జరగాలని, అధికారులు స్వంత నిర్ణయాలు తీసుకోరాదని అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు దిశా _ “నిర్దేశం” చేసరు.

ఆర్మూర్ శివారులోని చేపూ ర్ లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు.ఎన్నికల విధులు చట్టబద్ధంగా, జాగ్రత్త తో నామినేషన్ల స్వీకరణ, స్క్రూటి, ఉపసంహరణ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా జరగాలని సూచించారు అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలి.నామినేషన్ల ఉపసంహరణకు ప్రతిపాదకులు వస్తే పూర్తిగా పరిశీలించి బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల పేర్లు అక్షర క్రమంలో ఉండాలనీ వివరించారు.నామినేషన్ల సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసి బ్యాలెట్ పత్రంలో “నోటా” చిహ్నాన్ని తప్పనిసరిగా చేర్చాలని ఎన్నికలు పారదర్శకంగా జరగాలని, జిల్లాకు మంచి పేరు రావాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, డీఎల్పీఓ ఏ.శివకృష్ణ, ఆర్.ఓలు, ఏ.ఆర్.ఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!