నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-25
కాకతీయ విద్యార్థుల ప్రతిభపై ప్రశంసల జిల్లు -జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్
నేటి ప్రపంచ పొటికి దీటుగా విద్యార్థులు తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శించడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్ అన్నారు. మంగళవారం కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో టెట్రోనీక రోబోటిక్స్ ఎక్సపో 2025 నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో కాకతీయ స్కూలు పిల్లలు వివిధ రకాలైన ప్రాజెక్ట్స్ తయారు చేసి రోబోటిక్స్ ఎక్సపో లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ విచ్చేసి పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ దగ్గరికి వెళ్లి ఎలా చేసారు, వాటి ఉపయోగాలు ఏమిటి అని క్షుణంగా ప్రతి పిల్లలను అడిగి తెలుసుకున్నారు..భవిష్యత్తులో వాటి ఉపయోగాలు ఎంతగానో ఉపయోగపడతాయని, భవిష్యత్తు అగ్రికల్చర్, ఆటోనోమౌస్,మెకానికల్, ఎడ్యుకేషనల్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (ఎ ల్) దీనిమీదనే అధారపడి ఉంటుందని ఇలాంటి విద్యను కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో పిల్లలకు విద్యను అందించడం చాలా గర్వకారణమని, ఇలాంటి కార్యక్రమాలు జరగడం మన జిల్లా విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.డైరెక్టరు సి హెచ్. తేజస్విని మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ మా స్కూలుకి వచ్చి మా యెక్క పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ చూసి వాటి ఉపయోగాలు తెలుసుకోవడం భవిష్యత్తులో వాటి ఉపయోగాలు తెలియ చేసినందుకు దన్యవాధాలు తెలిపారు.అలాగే పిల్లల తల్లిదండ్రులు పిల్లలు చేసిన పరికరాలను చూసి వారు సంతోషించి మేనేజ్ మెంట్ కు కృతజ్ఞతలు తెలిపినందుకు వారికి అభినందనలు తెలపుతున్నమన్నారు..ఈ కార్యక్రమాంలో పిల్లలు తయారు చేసినటువంటి ప్రాజెక్ట్స్ విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి చూసి వాటి ఉపయోగాలు తెలుసుకున్నారు. తమ పిల్లలు చేసిన అత్యాధునికమైన పరికరాలను చూసి ఎంతగానో సంతోషించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు సి హెచ్. తేజస్విని,సి హెచ్ రాజా, ప్రిన్సిపాల్ సి హెచ్. రామోజీ రావు, పీవీ నటరాజ్, కో -ఆర్డినేటర్ శ్రీలత, రోబోటిక్స్ హెచ్ ఒ డి సదానంద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.