నిజామాబాద్ జై భారత్ మే :27 వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిజామాబాద్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు.నగరంలోని నెహ్రూ పార్క్ నుంచి అర్సపల్లి వరకు రోడ్డుకు ఇరువైపుల ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.తాము వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకమని, దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ వర్కర్ జమీరుద్దీన్ మాట్లాడుతూ ఇస్లాం సంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్స్ అంటారు. వక్స్ ఆస్తులన్నీ అల్లాకు చెందుతాయని భావిస్తారు. కనుక వాటి అమ్మకం, ఇతర ప్రయోజనాలకు వాడకం పూర్తిగా నిషిద్ధం. మసీదులు, మదర్సాలు, శ్మశానవాటికలు, అనాథాశ్రమాల నిర్మాణ నిర్వహణ తదితరాల నిమిత్తం ఉపయోగించాలి . కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా వక్ఫ్ బిల్లును ఆమోదించడం సరికాదని విమర్శించారు. వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేసే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వం
Updated On: May 27, 2025 3:34 pm
