గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీసింది. -కబ్జాకు గురైన శివాలయ భూమిని కాపాడుతా.

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్– భూపతిరెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 లక్షల కోట్ల అప్పుచేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించిందని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి విమర్శించారు.సిరికొండ మండలంలోని చీమను పల్లి గ్రామంలో సిరికొండ వేములవాడ ఆర్ అండ్ బి రోడ్డుకు రెండు కోట్ల నిధులతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చీమలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.చీమన్ పల్లి గ్రామానికి ఇప్పటి వరకు ఐదు కోట్ల నిధులు కేటాయించి పనులు నడుస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. చీమన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, పేదవారి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. గ్రామంలో ఉన్న శివాలయం భూమి కబ్జాకు గురి అయిందని తమకు ఫిర్యాదు వచ్చిందని జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సర్వే చేయిస్తానని అన్నారు. దేవుడు భూమిని ఎవరు కబ్జా చేసిన చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. వెంకటేశ్వర స్వామి దేవాలయానికి త్వరలో నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు అప్పు కట్టడానికి నిధులు సరిపోతున్నాయని ఎమ్మెల్యేభూపతి రెడ్డి అన్నారు. చీమనపల్లి గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించిన స్థలాన్ని, ఆరోగ్య కేంద్రానికి కేటాయించడం జరిగిందని, ఇక్కడి ప్రజలకు దగ్గరలో ఉండాలని సీఎంతో మాట్లాడి ఆ స్థలానికి కేటాయించామని అన్నారు. చీమన్ పల్లి గ్రామానికి త్వరలో బ్యాంకు కేటాయించి ప్రారంభిస్తామని అందరి కి అందుబాటులో ఉండేటట్టు చూస్తామని అన్నారు. అలాగే ఇక్కడ ఉన్న బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కొన్ని కారణాలతో ధర్పల్లికి మార్చడం జరిగిందని, అది అక్కడనే ఉంటదని అనుకోవద్దని చీమన్ పల్లి గ్రామంలో గవర్నమెంట్ భూమి ఉంటే మంచి భవనాన్ని నిర్మించి మళ్లీ ఇక్కడికి తెప్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.. ఎస్టీ రెసిడెన్షియల్ స్కూలు ప్రస్తుతం 250 మందికి సరిపడే విధంగా ఉందని, విద్యార్థులు 450 ఉన్నారని, ఎస్సీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ తోమాట్లాడి అదనంగా గదులు ఏర్పాటు చేయాలని మాట్లాడడంజరిగిందని అన్నారు. అనంతరం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొండూరు,చీమన్ పల్లి,సిరికొండ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, డిసిసి కార్యదర్శి, యూత్ నాయకులు, సొసైటీ చైర్మన్లు, సొసైటీ డైరెక్టర్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు,

Join WhatsApp

Join Now

Leave a Comment