నిజామాబాద్ జై భారత్ జూన్ 11: ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్నాపల్లి గ్రామంలో ఈ మద్య కాలంలో మాజీద్ ఖాన్ మరియు వారి కుటుంబ సభ్యుల పై పాత కక్షలు మనసులో పెట్టుకొని తాళ్ల నవీన్, టేకుమల్ల మనోజ్, గొల్ల అశోక్, సంఘముల నిఖిల్, వడ్లూరి రంజిత్ కుమార్, కటికే రమేష్ వీరందరూ కలిసి ముప్పేట దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో పాల్గొన్న వారిపై కేసు నమోదు చేసి , ఇట్టి కేసు పై పక్కగా ఇన్వెస్టిగేషన్ చేసి, ఎవ్వరు ఈ చర్యకు కారకులో వారిని గుర్తించి రిమాండ్ చెయ్యడం జరిగింది.కావున నిజామాబాదు పోలీస్ కమీషనరెట్ పరిధిలో ఎవ్వరయిన భవిష్యత్తులో ఎలాంటి అల్లర్లకు శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించిన వారిపై పూర్తి స్థాయి ” నిఘా వ్యవస్థ” ఉంటుందని ప్రతీ ఒక్కరు తమ నడవడికను మార్చు కోవాలని, లేని యెడల వారి పై తగుచర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎవ్వరికైనా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిoచడం లేదా సమాజంలో ఉద్రిక్తతలను రేపే విధంగా వ్యవహారించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ హెచ్చరించడం జరిగింది. పోలీస్ శాఖాపరంగా శాంతియుత వాతావారణం కొరకై నిర్విరామంగా కృషి జరుగుతుందని, ప్రజల సహాకారం అత్యంత ప్రధానమైనదని తెలియజేశారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిoచే వారి సమాచారం ఎవ్వరికైనా తెలిసిన మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని లేదా ఈ దిగువ తెలియజేసిన ఫోన్ నెంబర్లకు తెలియజేయగలరు. సమాచారం ఇచ్చిన పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలియజేశారు.
డయల్ 100,స్పెషల్ బ్రాంచ్ నంబర్ 8712659777
పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ :08462 226090