నిజామాబాద్ జై భారత్ జూన్ 17:నేడు పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయానికి వృద్ధురాలు తన గోడు వినిపించుకోవడానికి పోలీస్ క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది.క్యాంపు కార్యాలయానికి వస్తున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ఐపీఎస్. అట్టి వృద్ధిరాలిని చూసి తన కారులో నుంచి దిగి త్వరితగతిన ఆ వృద్ధ ఫిర్యాదు రాలు వద్దకు వెళ్లి అట్టి ఫిర్యాదును తీసుకొని ఆమె సమస్యను పూర్తిగా వినడం జరిగింది.వృద్ధురాలు యాదమ్మ, ఆర్మూర్ ప్రాంతానికి చెందిన వృద్ధురాలిగా తెలిపినది. ఆమెపై పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని తమ సమీప బంధువులు దాడి చేశారని తెలియజేసింది. ఈ వృద్ధురాలి సమస్యని త్వరగా పరిష్కరించాలని ఆర్మూర్ SHO ను ఆదేశాలు జారీ చేయడం జరిగింది.