నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:12
నేడు నిజామాబాద్ నగరం యందు హనుమాన్ శోభాయాత్ర నీలకంఠేశ్వర్ దేవాలయం నుండి RR చౌరస్తా వరకు గల ఏర్పాట్లను *నిజామాబాదు పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS., పరిశీలించడం జరిగింది.
ఇట్టి శోభయాత్ర సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో శోభయాత్ర ప్రతి ఒక్కరు నిర్వహించుకోవాలని, ఎవరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని అన్నారు. ప్రజలు ఎవ్వరు కూడా ఎలాంటి రూమర్సులను నమ్మకూడదని, ఇట్టి శోభయాత్ర పూర్తిగా CC కెమెరాల నిఘా మధ్య నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు ఏర్పాటు చేసినటువంటి దాదాపు 225 CC కెమెరాల ఫుటేజ్ విభాగము ద్వారా హనుమాన్ శోభయాత్రను వీక్షించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.