తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:24
ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 30న బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో మహనీయుల మహాత్మా జ్యోతిరావు ఫూలే, డా.బాబా సాహెబ్ బి.ఆర్. అంబేద్కర్,బాబు జగ్జీవన్ రామ్ మహనీయుల జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని మండలాల ఇంచార్జ్ దాసరి శ్యామ్ పాత్రికేయులతో తెలిపారు.జయంతి ఉత్సవాల కరపత్రాలను రుద్రూర్,వర్ని,చందూర్,మోస్ర మండలాలలో బహుజన నాయకులతో కలిసి ఇన్చార్జి దాసరి శ్యామ్ ఆవిష్కరించారు. ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా శ్యాంమ్ మాట్లాడుతూ… ఈ మహనీయుల జయంతికి మేధవులు వక్తాలు జెబి రాజు గాలి వినోద్ కుమార్ , డా.ప్రసన్న హరి కృష్ణ హాజరు అవుతున్నారని గ్రామాల్లో ఉన్న బహుజనులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మహానీయుల జయంతిని విజయవంతం చేయాలని మండలాల ఇన్చార్జి దాసరి శ్యాంమ్ కోటగిరి బి.యస్.పి. మండల అధ్యక్షులు ఇందూరు సాయిలు చేతనగర్ విద్యాసాగర్ కోరారు.