రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 20 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ నగర మేయర్ గా ఉమారాణి శుక్రవారం అత్యంత వైభవంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, నూడా చైర్మన్ కేశ వేణు,రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన మేయర్, డిప్యూటీ మేయర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ నిజామాబాద్ నగర పాలక సంస్థలో సరికొత్త అధ్యాయం మొదలైందన్నారు. అవినీతి రహిత పాలనే మా లక్ష్యమని, పట్టణాన్ని అవినీతికి తావులేకుండా, రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు ఇవాళ మేయర్ పీఠాన్ని అప్పగించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిజామాబాద్ను అభివృద్ధికి నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు.









