నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 17.(షేక్ గౌస్)
వక్ఫ్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వం తన పెత్తనం చలయించడానికి కుట్ర పన్నుతోందని ముస్లిం మత సంస్థల నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.వక్ఫ్ బోర్డులో సవరణల పేరుతో ముస్లింల ఆస్తులపై హక్కును క్రమంగా బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నదని ముస్లిం పండితులు ఆరోపించారు.సోమవారం ముస్లిం పర్సనల్ లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ధర్నా చౌక్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం మత సంస్థల నేతలతో పాటు మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ నిరాడి లక్ష్మణ్ కూడా పాల్గొని ముస్లింల హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












