నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి : 18
మార్చి నెలాఖరు లోగ నిర్దేశిత లక్ష్యం మేరకు ఆస్థి పన్ను వసూళ్లు చేసుకోవడానికి మున్సిపల్ యంత్రాంగం దూకుడు పెంచింది.కానీ ఏళ్ల తరబడిగా పేరుకు పోయిన మొండి బకాయి ల జోలికి వెళ్లకుండా సాధారణ ప్రజల బకాయిల కోసం సైతం రచ్చ చేస్తుండడం తో వివాదాలు తలెత్తుతున్నాయి.తాజాగా నగరంలోని గాజులపేట్ లో నరేందర్ అనే వ్యక్తి ఇంటికి బకాయి వసూళ్ల కోసం పది మంది స్పెషల్ టాస్క్ ఫోర్స్ వెళ్ళింది. వెంటనే బకాయి కట్టాలంటూ ఇంటి ఓనర్ నరేందర్ ను దబాయించారు. అయ్యో మర్చి పోయా సార్ నాలుగైదు రోజులు గడవు ఇవ్వండి అంటూ మోర పెట్టుకున్నాడు.అయినా నా బకాయి అయిదు వేల రూపాయలే కదా అన్నాడు ఎహే ఉన్నపలంగా కట్టాలంటూ వారు ఓవర్ యాక్షన్ చేయడంతో అసహనం కు గురైన నరేందర్ బ్లెడ్ తెచ్చుకొని ఎడమ చేతిమీద గట్ల వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. బకాయి వసూళ్ల కోసం వచ్చిన మున్సిపల్ అధికారులు వ్యవహరించిన తీరును స్థానికులు సైతం నిరసించారు.దీనితో చేసేది లేక వెనుదిరిగారు. సరే బకాయి వుంటే డిమాండ్ నోటిస్ ఇచ్చి ఒత్తిడి చెయ్యాలి క ముఖ్యంగా నగరంలో కొందరు రాజకీయ వ్యాపార ప్రముఖులు ఆస్థి పన్నులు చెల్లించే విషయంలో మొండికేస్తున్నారు. అనేక మంది బడా నేతల ఇండ్లకు టాక్స్ చెల్లించ కుండా కాలయాపన చేస్తున్నారు.ఇలాంటి వారి విషయంలో ఇలాంటి పౌరుషం ఎందుకు చూపలేక పోతున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి గత పదేళ్లుగా డైరెక్ట్ ఐ ఏ యస్ లే కమిషనర్ లు గా పనిచేస్తారు వేరెవ్వరు బడా నేతల ఆస్థి పన్ను బకాయి వసూళ్ల కోసం కనీసం కన్నెత్తి కూడా చూడలేదు.సాధారణప్రజలు వ్యాపారుల బకాయి విషయంలో మూకుమ్మడిగా వెళ్లి రూల్స్ పేరుతొ బెదరగొట్టి హంగమా చేసి వసూళ్లు చేసుకోవడం మున్సిపల్ అధికారులకు ఆనవాయితీ వస్తున్నదే.