తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ లో కల్లోలం 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:18
నిజామాబాద్ నగరంలో తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి సై అంటే సై అంటూ మాటల తూట్లు పొడుచూ కుంటున్నారు . రెండు రోజుల క్రితం ఫిరోజ్ ఖాన్ ఒక ప్రకటన వీడియో ద్వారా జారీ చేశారు. ఇందులో దేగం యాద గౌడ్, వినోద్ కుమార్ వీరిద్దరూ మైనారిటీ వైపు చూస్తాలేరని వీరికి మైనార్టీ మద్దతు అవసరం లేదని మైనారిటీ వైపు చిన్న చూపు చూస్తున్నారని వాపోయారు. ఇలా ఉంటే వచ్చే తరహాలో మైనార్టీ తరఫున తెలుగుదేశం పార్టీకి ఎటువంటి మద్దతు ఉండదని ఫిరోజ్ ఖాన్ తెలిపారు. దేగం యాద గౌడ్, వినోద్ కుమార్, తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో మైనారిటీ తోడు అవసరం లేదని చెప్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో వీరిద్దరూ వేరే పార్టీ కార్యాలయంలో అడుక్కుంటూ తిరుగుతారని ఫిరోజ్ ఖాన్ విమర్శలు వెల్లువెత్తారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదలతో ఈరోజు శుక్రవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ కార్యాలయనికి తాలం పడింది . త్వరలో ఈ సమస్యను పరిష్కరించని యెడల యాద గౌడ్ మరియు వినోద్ కుమార్ ల దిష్టిబొమ్మ దహనం చేస్తామని, ధర్నాకీ   దిగుతామని ఫిరోజ్ ఖాన్ హెచ్చరించారు.ఇది ఇలా ఉంటే వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి చెడు అనుభవాలే ఎదురవుతాయని సాంకేతాలు వ్యక్తం అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment