నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్
తేలంగాణ బిసి గ్రాడ్యుయేట్స్ ఫోరం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వేల్పూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సురేష్ ని నియమిస్తున్నట్లు తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల సురేష్ మాట్లాడుతూ.తెలంగాణలో రోజురోజుకు బిసి నిరుద్యోగ సమస్య పెరుగుతున్నదని మరియు డిగ్రీ పట్టాలు పుచ్చుకొని ఎటువంటి ఆదాయం లేకుండా ఉపాధి లేకుండా ఉద్యోగాలు లేకుండా జీవనం సాగిస్తున్నారని అబ్బగొనీ అశోక్ గౌడ్ ఆదేశాల మేరకు నిరంతరం నిరుద్యోగుల కోసం పోరాడుతానని ఎర్రోళ్ల సురేష్ తెలియజేశారు. అలాగే పట్టభద్రులు ఈ నెల 6 వరకు ఎమ్మెల్సీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. అబ్బగోని అశోక్ గౌడ్ బీసీల అనేక ఉద్యమాలు చేసినటువంటి బిసీ ఉద్యమ నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకుడు మరియు తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఏర్పాటు చేసినటువంటి అబ్బగొని అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని ఎర్రోళ్ల సురేష్ తెలియచేశారు.











