నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-24
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అడిషనల్ డీ.సీ.పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు ఎస్సై గోవింద్ ,స్పెషల్ పార్టీ సిబ్బంది కలిసి నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీక్లీ మార్కెట్, సాయి కిరణ్ షాప్ పై రైడ్ చేయడం జరిగింది.ఈ దాడిలో స్వాధీనం చేసుకున్నవి ఈ దిగువ విధముగా గలవు.20 క్వింటళ్ళు పి.డి.ఎస్ రైస్ దీని విలువ సుమారు గా 1,00,000/-రూపాయలు తదుపరి చర్య నిమిత్తం నిజామాబాద్ వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ కి అప్పగించనైనది.