నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 23 : (షేక్ గౌస్) నిజామాబాద్ పట్టణంలో హెల్ప్ వెల్ఫేర్ & ఎడ్యుకేషనల్ సొసైటీ నాయకులు ఫూలాంగ్‌లో టైలరింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి స్పందించిన ఎంఎల్సీ, సియాసత్ న్యూస్ ఎడిటర్ ఆమీర్ అలీ ఖాన్ మహిళలు–యువత ఆర్థిక స్వావలంబన కోసం టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, క్రోషియా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహం ఇస్తే కుటుంబాల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని, బేకరీలు–చిన్న పరిశ్రమలకు సహాయం అందించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా జునైద్ అడ్వకేట్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సమాజంలో మార్పు రావడానికి చట్టపరమైన సహకారం అందిస్తామని తెలిపారు.కార్యక్రమంలో మదీనా మస్జిద్ అధ్యక్షుడు మొహమ్మద్ జావేద్ అలీ, జునైద్ అహ్మద్, రఫీభాయ్, తమీజ్ ఖాన్, అబ్దుల్ ఫహీమ్, షేక్ ఇల్యాస్ తదితరులు పాల్గొని ఆమీర్ అలీ ఖాన్ ని సన్మానించారు.
టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం : ఆమీర్ అలీ ఖాన్
Published On: August 23, 2025 6:55 pm
