తైబజార్ వేలంపాట వాయిదా

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-26
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో వారాంతపు సంత తో పాటు ప్రతినిత్యం వసూలు చేసే తై బజార్ వేలంపాట మళ్లీ వాయిదా పడింది. బుధవారం ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అధ్యక్షతన నిర్వహించిన తైబజార్ వేలంపాట రెండవసారి కూడా వాయిదా పడింది. మున్సిపల్ తై బజార్ వేలంపాటలో ప్రభుత్వం 29 లక్షల పైచిలుకు ధరలు నిర్ణయించింది. అని వేలంపాటలో పాల్గొన్న వారు ప్రభుత్వం నిర్ణయించిన బిట్ అమౌంట్ పై వేలంపాట లో పాల్గొనడానికి ఆసక్తి చూపలేదు.కమిషనర్ రెండవసారి నిర్వహించిన తైబజార్ వేలంపాటను వాయిదా వేస్తూ ఈనెల 28న తిరిగి వేలంపాటలు నిర్వహిస్తామని తెలిపారు. ఇంకో రెండు రోజులు గడువు ఉండడంతో ఆసక్తి ఉన్నవారు తై బజార్ వేలంపాటలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కోరారు. అని ప్రభుత్వం నిర్ణయించిన బిట్ అమౌంట్ అధికంగా ఉండడంతో వేలంపాటలో పాల్గొనడానికి ఎవరు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!