నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ :23
జర్నలిస్టులు మతసామరస్యాన్ని ప్రోత్సహిస్తూ తమ ప్రెస్ క్లబ్‌ను భిన్న మతాల అనుబంధానికి వేదికగా నిలిపి, వివిధ పండుగలను నిర్వహించడం అభినందనీ యమని తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హాందాన్ అన్నారు.రంజాన్ మాసం పురస్కరించుకుని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందు ను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాహెర్ బిన్ హాందాన్ మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ముస్లిం మైనారిటీల పట్ల జర్నలిస్టుల ప్రేమ, అభిమాననికి నిదర్శనమని పేర్కొన్నారు. హిందూ, ముస్లింలు సోదర భావంతో ఐక్యంగా ఉంటు తెలంగాణ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఖుద్దూస్, కాంగ్రెస్ నాయకుడు జావీద్ అక్రమ్, బీజేపీ మైనార్టీ మోర్చా నాయకుడు మునీర్ రషీద్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి శేఖర్, కార్యవర్గ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.