నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:1
నగరంలోని రెండవ టౌన్ నూతన ఎస్ఐ గా సయ్యద్ ఇమ్రాన్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న ఎస్ఐ యాసిర్ అరాఫత్ ను మెండోరా కు బదిలీ కావడంతో జగిత్యాల వీఆర్ లో ఉన్న సయ్యద్ ఇమ్రాన్ నిజామాబాద్ రెండవ టౌన్ కు బదిలీ పై వచ్చారు.ఈ సందర్భంగా అజ్జు ఖాన్, మహమ్మద్ జమీర్ ఉద్దీన్, అజీజ్ ఉర్రహేమన్, ఎజాస్,ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ..శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమా లు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. రెండవ టౌన్ పోలీసు సిబ్బంది నూతన ఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు.