మోపాల్ మండల కేంద్రం లో పేకాట స్థావరాలపై మోపాల్ ఎస్ హెచ్ ఓ జెడ్ సుస్మిత దాడి

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 21 : దీపావళి పండుగ సందర్భంగా మోపాల్ మండల కేంద్రంలో పలు పేకాట స్థావరాలపై ఎస్ హెచ్ ఓ జెడ్ సుస్మిత ఆధ్వర్యంలో దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ హెచ్ ఓ జెడ్. సుస్మిత మాట్లాడుతూ మోపాల్ మండల కేంద్రంలో ఐదు పేకాట స్థావరాలపై దాడి నిర్వహించినట్లు వెల్లడించారు.పేకాట ఆడుతూ పట్టుబడిన 12 మంది మొత్తం రూపాయలు 16,790 వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకి తరలిస్తామని మోపాల్ ఎస్ హెచ్ ఓ జెడ్. సుస్మిత తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment