తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 21.
కాంటాక్ట్ లెక్చర్లను పర్మనెంట్ చేయడంపై హైకోర్టు తీర్పుతో నిరుద్యోగులు పట్టభద్రులు అసంతృప్తి లోనయ్యారని గత ప్రభుత్వ మాదిరిగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అవలంబిస్తుందని ఇది సరైన విధానం కాదని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు.రాష్ట్రంలో దాదాపు 40 లక్షల పైన నిరుద్యోగులు మరియు పట్టబదులు ఉన్నారని ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి రెడ్ అండ్ టెస్టు మెరిట్ లిస్టు మరియు రోస్టర్ స్కేల్ ప్రకారము ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రభుత్వ జూనియర్ కాంట్రాక్ట్ లెక్చరర్ లను డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల ను ఏ విధమైనటువంటి పరీక్షలు గాని విధివిధానాలు కానీ అవలంభించకుండా హైకోర్టు రెగ్యులర్ చేయడంపై సరైన పద్ధతి కాదని అబ్బగొని అశోక్ గౌడ్ తెలియజేశారు. దీనిపై నిరుద్యోగుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల కోసం పట్టభద్రుల కోసం ఎంత దూరమైనా వెళ్దామని వారికి న్యాయం జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలలను కాకుండా ప్రభుత్వ కార్యాలయంలో చాలామంది కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారని వారిని కూడా పనికి తగ్గట్టు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరియు గెస్ట్ లెక్చరర్లు , గెస్ట్ టీచర్ ,పార్ట్ టైం లెక్చరర్లు పార్ట్ టైం టీచర్లు, వీరిని కూడా పరిగనంలోకి తీసుకొని వారి శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వం లాగానే నిరుద్యోగులకు మరియు పట్టభద్రులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ డిమాండ్ చేశారు.