నిజామాబాద్, 26 October
ప్రజా సమస్యల పరిష్కారానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం 39 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య 39 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను కమిషనర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులను పరిశీలించి చట్టప్రకారం సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సీఐలతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఫిర్యాదుల ప్రస్తుత స్థితిని తెలుసుకుని, పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, మధ్యవర్తులు, పైరవీల ప్రమేయం లేకుండా నేరుగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు పోలీసులు మరింత చేరువ కావడంతో పాటు, శాంతిభద్రతలను పరిరక్షించడమే జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తోందన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, చట్టపరంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసు సేవలను ప్రజలు స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కమిషనర్ పిలుపునిచ్చారు.






