నిజామాబాద్, 2026-08-15
నిజామాబాద్ జిల్లా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్-875గా విధులు నిర్వర్తిస్తున్న అనుప సాయిలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక సేవా పతకంను ప్రకటించింది. 34 ఏళ్ల నిస్వార్థ సేవకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ చేతుల మీదుగా ఆగస్టు 15న అందుకున్నారు.
నిజామాబాద్ జిల్లా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్-875గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీ అనుప సాయిలుకు పోలీస్ శాఖలో అందించిన విశిష్ట, అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన సేవా పతకంను ప్రకటించి సముచితంగా గౌరవించింది. 34 ఏళ్ల నిస్వార్థ సేవకు దక్కిన ఈ గౌరవం ఆయన పోలీస్ ప్రస్థానానికి తార్కాణంగా నిలిచింది.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పురస్కారం
80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభవేళ నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ చేతుల మీదుగా ఈ సేవా పతకాన్ని హెడ్ కానిస్టేబుల్ అడపా సాయిలు ఎంతో గర్వంగా అందుకున్నారు. ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఆయన పతకం అందుకుంటున్న ఆ క్షణం, ఆయన సుదీర్ఘ పోలీస్ ప్రస్థానానికి తార్కాణంగా నిలిచింది.
34 వసంతాల అంకితభావం
శ్రీ అనుప సాయిలు పోలీస్ శాఖలో అడుగుపెట్టి సుదీర్ఘంగా 34 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ మూడున్నర దశాబ్దాల కాలంలో ఆయన ఎన్నో సవాళ్లను, ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోయినా, సమాజం బాగుండాలి, శాంతిభద్రతలు సజావుగా సాగాలనే తపనతో ముందుకు సాగారు. ఎక్కడ డ్యూటీ వేసినా, ఏ బాధ్యత అప్పగించినా చిరునవ్వుతో స్వీకరించి, ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. పోలీస్ అంటే భయం కాదు, భరోసా అనే భావనను ప్రజల్లో కలిగించడంలో ఆయన ఎప్పుడూ ముందున్నారు.
ట్రాఫిక్ నియంత్రణలో నిరుపమాన సేవలు
ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహించడం అంటే కత్తిమీద సాము లాంటిది. నిజామాబాద్ నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీని అదుపు చేస్తూ, ట్రాఫిక్ జామ్‌లు కాకుండా చూస్తూ, రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పిస్తూ సాయిలు గారు అందించిన సేవలు అమోఘమైనవి. చురుకైన కదలికలతో, బాధ్యతాయుతమైన పనితీరుతో నిత్యం రోడ్లపై నిలబడి ప్రజల రాకపోకలను సాఫీగా సాగేలా చూడటంలో ఆయన నిరంతరం శ్రమించారు. ఈ సుదీర్ఘ సర్వీసులో ట్రాఫిక్ విభాగంలో ఆయన పోషించిన పాత్ర నగర ప్రజల ప్రశంసలు అందుకుంది.
కఠోర శ్రమకు దక్కిన ప్రతిఫలం
ఒక నిరుపేద, సామాన్య కానిస్టేబుల్ స్థాయి నుండి క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేస్తూ హెడ్ కానిస్టేబుల్ స్థాయికి ఎదిగి, నేడు రాష్ట్ర స్థాయిలో ఇంతటి విశిష్ట పురస్కారాన్ని అందుకోవడం ఆయన చేసిన కఠోర శ్రమకు, కుటుంబం చేసిన త్యాగాలకు దక్కిన నిజమైన ప్రతిఫలం. కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా గుర్తింపు వస్తుంది అనడానికి అడపా సాయిలు జీవితమే నిదర్శనం. పోలీస్ పరేడ్ మైదానంలో ప్రభుత్వ పెద్దల సమక్షంలో, తోటి ఉద్యోగుల కరతాళ ధ్వనుల మధ్య ఆయన మెడలో మెరిసిన సేవా పతకం.. ఆయన 34 ఏళ్ల నిస్వార్థ కష్టానికి, చెమట చుక్కలకు దక్కిన గొప్ప కానుక.











