నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌గా ఎస్పీజీకే మూర్తి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన రాక సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది ఘనస్వాగతం పలికారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం, మూర్తి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిసి, అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్లు, సూపరింటెండెంట్లు, రీజియన్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో కొత్త బస్సు మార్గాల ఆవశ్యకత, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ప్రజా రవాణా సౌకర్యాల విస్తరణ, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదల వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.
విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు మరింత మెరుగైన బస్సు సేవల కల్పనపై కూడా చర్చ జరిగింది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
జిల్లా ప్రజలకు సురక్షితమైన, సమయపాలనతో కూడిన, నాణ్యమైన రవాణా సేవలను అందించడానికి టీజీఎస్ఆర్టీసీ కట్టుబడి ఉందని మూర్తి తన ప్రకటనలో తెలిపారు.






