నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8.
మాక్లూర్ మండలం అమ్రాద్ లో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్రాద్ తండాలో జ్యోతిరామ్ దంపతులు రేషన్షాప్ నిర్వహిస్తున్నారు. అయితే విక్రమ్, పీర్సింగ్ అనే ఇద్దరు అన్నదమ్ములు తమకు బియ్యం పంపిణీ చేయడం లేదంటూ వారితో గొడవ పడ్డారు. దీంతో అక్కడే ఉన్న జ్యోతిరామ్, సోదరులు శ్రీనివాస్, రాజు నాయక్ అడ్డుకోగా ముగ్గురిపై విక్రమ్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. క్షతగాత్రులను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.