జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ గా శ్రీనివాస్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13.
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ గా పిడియాట్రిక్స్ ప్రొఫెసర్ పీ.శ్రీనివాస్ ను నియమించినట్లు ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసారు.మెడికల్ కళాశాలలో చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ పి.శ్రీనివాస్ ను ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ గా నియమితులయ్యారు.  ఇటీవల జిల్లా పర్యటనలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరించిన తీరు మారలేదు. ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించిన ఘటన జరిగి కొన్ని గంటలు మరవకముందే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మదిన వేడుకలు నిర్వహించి ఫంక్షన్ హాల్ గా మార్చిన దుస్థితిపై పత్రికల్లో వచ్చిన విషయం విధితమే. దీనిపై విచారణ చేసేందుకు వీలుగా ప్రతిమ రాజ్ ను సూపరింటెండెంట్‌ పోస్టు నుంచి తొలగించి ఆ స్థానంలో శ్రీనివాస్ ను నియమించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!