నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 25.
రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న సందర్భంగా అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్ లో జరిగిన సమీక్ష సమావేశం లో మాట్లాడుతు రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లోటుపాట్లు లేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా పనిచేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా తాగునీరు,పారిశుద్ధ్యం వంటి సమస్యలు రాకుండా క్షేత్ర సహాయ అధికారులకు, సిబ్బందికి బాధ్యతలను అప్పజెప్పారు. నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు.విధిలైట్లు, బోర్లు పైప్ లైన్లలో మరమ్మతులు ఉంటే ముందుగా సరి చేసుకోవాలన్నారు.అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా జరిగేలా మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రార్థన సమయంలో విద్యుత్ అంతరాయం కలగ కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్సీకి సూచించారు. దర్గాలు మసీదుల వద్ద పారిశుద్ధ్య సమస్య లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతల సమస్యలు ఎక్కడ కూడా తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సమస్యత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. వేసవికాలం ఆరంభం అవుతున్న సందర్బంగా మంచినీటి సరఫరకు ఇబ్బందులు లేకుండా ప్రణాళిక బద్ధంగా పనులు చేయాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. ఆయా జలాశయాలు చెరువులలో ఉన్న నీటి నిల్వలు ఎన్ని రోజుల వరకు మంచినీటి సరఫరా కోసం అవి సరిపోతాయో వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్ వసతి గృహాలకు మంచినీరు సరఫరా అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, అదనపు డిసిపి బసవరెడ్డి, జెడ్పి సీఈఓ సాయి గౌడ్,నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా మైనారిటీ అధికారి కృష్ణవేణి,డిపిఓ శ్రీనివాస్, ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ మరియు సంబంధిత శాఖలా అధికారులు పాల్గొన్నారు.