సియాసత్ సీనియర్ జర్నలిస్టుకు రాష్ట్రస్థాయి అవార్డు..

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్

కామారెడ్డి నిజామాబాద్ సియాసత్ ఉర్దూదినపత్రిక బ్యూరో మహమ్మద్ జావిద్ అలీ హైదరాబాదులో రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ జన్మదినం సందర్భంగా మైనార్టీ సంక్షేమ రోజు లో భాగంగా ఈ అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ చేతుల మీదుగా ఆయన తీసుకున్నారు .గత 38 సంవత్సరాలుగా ఒకే పత్రిక సియాసత్ దినపత్రిక లో ఉమ్మడి నిజాంబాద్ బ్యూరో గా పనిచేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి 50 వేల నగదు తోపాటు రాష్ట్రస్థాయి అవార్డు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ను కూడాఇవ్వడం జరిగింది. జావిద్ అలీకి అవార్డు దక్కడం పట్ల నిజాంబాద్ కామారెడ్డి జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పున్నం ప్రభాకర్ గౌడ్. సియాసత్ ఎడిటర్ ఎమ్మెల్సీ అమెర్ అలీ ఖాన్. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్బిన్ హందన్ మైనార్టీ కమిషన్ చైర్మన్ తారీక అన్సారి. వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మత్ ఉల్లా హుస్సని. హజ్ కమిటీ చైర్మన్ కుసురు పాషాబియాభాని .tmres వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ . అధికారులు నాయకులు జర్నలిస్ట్ సంఘాలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment