తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్.
నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 22: ఈరోజు నిజామాబాద్ జిల్లాలో లేబర్ కార్యాలయంలో ACL శ్రావణి మేడం కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి మహిళా బీడీ ప్యాకర్స్ కార్మికులు అందులో పనిచేస్తున్నారు కానీ ఈ మధ్యకాలంలో బీడీ యజమాన్యం ప్యాకింగ్ సెంటర్ ను చెందూరు నుండి కుర్నాపల్లికి మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. చందూరు కు చెందిన మహిళ బీడీ ప్యాకర్స్ కార్మికులు కుర్నాపల్లి కి వెళ్లడానికి అనే ఆటంకాలు వస్తున్నాయి బస్సు సౌకర్యం లేదు ఆటో కట్టుకొని వెళ్తే వచ్చే కూలి కూడా ఆటోకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బీడీ ప్యాకర్స్ కార్మికులు ఉపాధి లేక మహిళ బీడీ ప్యాకర్స్ కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి ఇందులో పనిచేసే కార్మికులు14 సంవత్సరాలు చేసిన సర్వీసు కనీసం యజమాన్యం దృష్టిలో పెట్టుకొని చందూర్లో కొనసాగించాలని సబ్లే వాగేరే అండ్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ శివాజీ జిఎం గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యజమాన్యానికి తెలియజేస్తామని వారితో మాట్లాడి చర్చించి చెప్తామని చెప్పడం జరిగింది. సమస్యను పరిష్కారం చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా నూర్జహాన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేఖ విజయ ఉష భారతి అనిత జ్యోతి అభిజ్ఞ తదితరులు పాల్గొన్నారు.











