ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ : 07 మోపాల్ గ్రామం లో షీ టీమ్స్ పోలీస్ వారు విద్యార్థులకు అవగాహన సదస్సు” నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం లో కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా ఆడపిల్లల భద్రత,అత్యవసర పరిస్థితుల్లో తమని తాము ఏ విధంగా రక్షించుకోవాలి,సోషల్ మీడియా సైబర్ నేరాలలో ఆడవాళ్లు చిన్నపిల్లలు ఏ విధంగా బలవుతున్నారు అనే అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమం తదనంతరం పిల్లల సమస్యలను తెలుసుకోవడానికి ఒక బాక్స్ ని ఏర్పాటు చేసి పిల్లల తమ సమస్యలను అందరి ముందు కాకుండా పేపర్ మీద రాసి చీటీలు వేస్తే వాటిని గోప్యంగా పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ స్రవంతి.మోపాల్ ఎస్.ఐ.సుస్మిత,పాఠశాల ప్రిన్సిపల్ సుప్రజ పోలీస్,పాఠశాల సిబ్బంది,విద్యార్థినిలు అందరూ పాల్గొన్నారు.
మోపాల్ గ్రామం లో షీ టీమ్స్ పోలీస్ వారు విద్యార్థులకు అవగాహన సదస్సు–మోపాల్ ఎస్సై జెడ్ సుస్మిత
Published On: November 7, 2025 9:07 pm









