నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్. నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ శ్రీమతి సింధూ శర్మ, ఐ.పి.యస్ ఆదేశానుసారంగా సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా భారత దేశ ప్రభుత్వ పిలుపుమెరకు రాష్ట్రీయ ఎక్తా దివాస్ కార్యాక్రమం , 31 న అదనపు పోలీస్ iకమీషనర్ ( అడ్మిన్ ) శ్రీ ఆర్. కోటేశ్వర రావు మరియు అదనపు పోలీస్ కమీషనర్ ( ఎ.ఆర్ ) శ్రీ శంకర్ నాయక్ ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమీషనర్ పోలీస్ సిబ్బందితో ప్రతిజ్ఞ మరియు పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు మార్చ్ ఫాస్ట్ కార్యక్రమం నిర్వహించారు .అనంతరం అదనపు పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ భారతదేశ ఉక్కు మనిషిగా పేరుపొందిన సర్దార్ వల్లబాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివస్ జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామనీ తెలిపారు.భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో మరియు దేశ సమగ్రత (ఐక్యత ) కొరకు కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తిగా, భారత దేశంలో గల అన్ని సంస్థానాలను విలీనం చేయటంలో ఎంతో కీలక పాత్ర పోషించారు అని తెలిపారు.ఈ కార్యాక్రమంలో ట్రాఫిక్ ఎ.సి.పి శ్రీ నారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం, రిజర్వు ఇన్స్ పెక్టర్స్ శ్రీ సతీష్ కుమార్ (అడ్మిన్), శ్రీ తిరుపతి (ఎమ్.టి.ఓ ), శ్రీ శ్రీనివాస్ (వెల్ఫేర్), ఆఫీస్ సూపరింటెండెంటు శ్రీ శంకర్ స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, ఐ.టి కోర్ టీమ్ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, ఎ.ఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది. హోమ్ గార్డ్సు సిబ్బంది పాల్గొన్నారు.
నిజామాబాద్ కమిషనరేట్ లో ఘనంగా సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతి
Updated On: November 2, 2024 7:31 pm
