ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక దినపత్రిక నవంబర్ : 01 (నవీన్ కుమార్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్సక్షన్ దివ్యాంగుల పాఠశాల ఆధ్వర్యంలో మానసిక, దివ్యాంగ, అంద, విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్నేహ సొసైటీ పాఠశాల నుండి పురవీధుల గుండా కొనసాగించి దేశ ఐక్యతను చాటి చెప్పే విధంగా ఐక్యమత్యమే మహాబలం, హమ్ సబ్ ఏక్ హై, యునైటెడ్ వి స్టాండ్, మేరా భారత్ మహాన్ అనే నినాదాలతో దేశ ఐక్యతను పురవీధుల గుండా సాగుతూ చాటిచెప్పారు. ఈ ర్యాలీ అనంతరం స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో ఏర్పాటు చేసిన దేశ ఐక్యత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్నేహ సొసైటీ, కార్యదర్శి ఎస్ సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ జ్యోతి, మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సి పాల్ రాజేశ్వరి మాట్లాడుతూ శాంతి అహింస అనే నినాదంతో జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడడం జరిగిందన్నారు. స్వాతంత్య్ర అనంతరం వివిధ సంస్థానాదిశుల పాలనలో ఉన్న రాష్ట్రాలను, ఈశాన్య భారతంలో భాగమైన కొన్ని రాష్ట్రాలను, నైజాం పాలనలో ఉన్న హైదరాబాద్ మరియు తెలంగాణ రాష్ట్రాలను భారత యూనియన్ లో కలిపారు. దేశ సమగ్రత దేశ ఐక్యత కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరు ఐక్యతగా ఉండాలని పోరాడిన గొప్ప వ్యక్తి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని తెలిపారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యవసాయ రైతాంగం దీనస్థితిలో ఉన్న వారికి సైతం వెన్నుదన్నుగా ఉండి పోరాడడం వల్ల అన్నదాతలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గా పిలవడం జరిగిందని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను 2014 నుండి నిర్వహిస్తున్నప్పటికీ ఈ సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారం ప్రతి ఒక్కరికి దేశ సమైక్యత సౌభాతృత్వం మానసిక దివ్యాంగులే కాకుండా ప్రతి ఒక్కరికి తెలియపరిచే దిశగా వచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కులమాతాలకు ఆతీతంగా కలిసి ఉన్నప్పుడే దేశ ఐక్యత ఇతర దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి,ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ.
Published On: November 1, 2025 11:19 pm











