రైతులకు రూ.500 బోనస్ — ఏ ఏం సి డైరెక్టర్ పెంట ఇంద్రుడు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్: 7 (షేక్ గౌస్)
నందిపేటలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.
నందిపేట్: రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్ర ల పారంభోత్సవాలు ముమ్మరంగా కొనసాగుతున్నయి, నందిపేట్ మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. రైతులు దళారీల వలలో పడి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దే ధాన్యం విక్రయించాలని ఏ ఏం. సి డైరెక్టర్ పెంట ఇంద్రుడు కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో పాటు, సన్న వడ్ల పై రూ.500 బోనస్ కూడా రైతులకు లభిస్తుంది” అని పేర్కొన్నారు.వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్లు, కుర్చీలు వంటి సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంద మహిపాల్, మాజీ ఏం పి టి సి సిలిండర్ లింగం, బి సి సెల్ నాయకులు, రైతులు మహిళలు పాల్గొన్నారు

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!