రేవంత్ రెడ్డి గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ ‘ ఇది తెలంగాణ సకలజనాభి ప్రాయం రేవంత్ ది దిక్చూచి లేని దిక్కుమాలిన పాలన

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి  జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:24

అవినీతి,అణచివేత,కేసులు, అరెస్టులు, భూకబ్జాలు తప్ప . అణాపైసంత అభివృద్ధి ఉందా?

కేసీఆర్ హయాంలో ‘ ప్రతీ ఇంట్లో సంక్షేమం, ప్రతీ కంట్లో సంతోషం’

రేవంత్ హయాంలో ‘ ప్రతీ ఇంట్లో సంక్షోభం, ప్రతీ కంట్లో విషాదం 

కాంగ్రెస్ సర్కార్ దుర్నీతికి మసకబారిన కేసీఆర్ పదేళ్ల ప్రగతి వైభవం

ఆరు గ్యారెంటీలకు పాతరేసిన కాంగ్రెస్ సర్కార్ 

కాంగ్రెస్ పాలనలో సీఎం ఫ్యామిలీ తప్ప ఎవరూ సంతోషంగా లేరు

వరంగల్ బీఆర్ఎస్ సభతో కాంగ్రెస్ సర్కార్ పతనం ఆరంభం

తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే మళ్ళీ కారు,సారు కేసీఆర్ రావాల్సిందే

వరంగల్ సభకు గులాబీ శ్రేణుల సమాయత్తం 

బీఆర్ఎస్ రజతోత్సహం తెలంగాణ ఇంటి పండుగ

నిజామాబాద్ జిల్లాతో బీఆర్ఎస్ ది పేగు బంధం

బీఆర్ఎస్ పార్టీకి తొలి అధికార పదవినందించిన చరిత్ర నిజామాబాద్ జిల్లాదే 

కేసీఆర్ ను మూడోసారి సీఎం చేయడంలోనూ నిజామాబాద్ జిల్లాదే ప్రధాన పాత్ర 

ఓరుగల్లు పొరుగడ్డకు తండోపతండాలుగా తరలిపోదాం

ఆర్మూరు టూ వరంగల్ గులాబీ మయం చేద్దాం

దారిపొడవునా ‘జై తెలంగాణ, జై కేసీఆర్’ నినాదాలు మారుమోగాలి

నిజామాబాద్ జిల్లా పంతం, ఇందిరమ్మ హింసారాజ్యం అంతం’

ఆర్మూర్ నియోజక వర్గంలో ‘గులాబీ ఆర్మీ పంతం -దుష్ట కాంగ్రెస్ – భ్రష్ట బీజేపీల అంతం’

పార్టీ మహాసభకు గులాబీ దుస్తులు ధరించి కదం తొక్కుదాం బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ‘రేవంత్ రెడ్డి గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ ‘ అనేది తెలంగాణ సకలజనాభి ప్రాయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పిలుపు నిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన అందుబాటులో ఉన్న నేతలతో వరంగల్ సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిది ఒక దిక్చూచి లేని దిక్కుమాలిన పాలన అని మండిపడ్డారు. అంతులేని అవినీతి, అణచివేత, కేసులు, అరెస్టులు, భూకబ్జాలు తప్ప రాష్ట్రంలో అణాపైసంత అభివృద్ధి ఉందా? అని నిలదీశారు. కేసీఆర్ హయాం తెలంగాణకు స్వర్ణయుగమని, అభివృద్ధి పరుగులు పెట్టిందని, ‘ ప్రతీ ఇంట్లో సంక్షేమం, ప్రతీ కంట్లో సంతోషం’ కనిపించిందని అయన గుర్తు చేశారు. రాష్ట్రానికి శనిలా దాపురించిన రేవంత్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం మూసీలో కలిసిపోయి ‘ ప్రతీ ఇంట్లో సంక్షోభం, ప్రతీ కంట్లో విషాదం కనిపిస్తున్నదని విమర్శించారు.కాంగ్రెస్ సర్కార్ దుర్నీతికి కేసీఆర్ పదేళ్ల ప్రగతి వైభవం మసకబారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి ఎన్నికల హామీలను మొత్తం పాతరేసిన కాంగ్రెస్ పదహారు నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ తప్ప ఎవరూ సంతోషంగా లేరన్నారు. వరంగల్ బీఆర్ఎస్ సభతో కాంగ్రెస్ సర్కార్ పతనం ఆరంభం కావడం తథ్యమని ఆయన చెప్పారు.హామీ ఇవ్వక పోయినా 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు 11,000 కోట్లు ఖర్చుపెట్టి కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేసిన ఘనత కేసీఆర్ ది. రైతుబంధు, రైతు బీమా, ఉచిత చేప పిల్లల పంపిణీ, ఉచిత గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కంటి వెలుగు, అమ్మ ఒడి హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం ఇలా అనేక పథకాలు చెప్పకపోయినా అమలు చేశాం. రుణమాఫీ, రైతు భరోసా, కల్యాణ లక్ష్మి, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు, 24గంటల కరెంట్, ఇంటింటికి మిషన్ భగీరథ మంచినీళ్లు, మెరుగైన వైద్యం, సర్కారు విద్యా సంస్థలలో సౌకర్యాలు, ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలు, పెన్షన్లు మళ్లీ కావాలంటే బీ ఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాల్సిందే.తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే మళ్ళీ కారు,సారు కేసీఆర్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అని జీవన్ రెడ్డి అన్నారు. కాగా ఈనెల 27 వ తేదీన వరంగల్ నగరంలోని ఎల్కతుర్తి వద్ద జరగనున్న బీఆర్ఎస్ ప్లీనరీ మహాసభకు తరలివెళ్లేందుకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గులాబీ శ్రేణులు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లాతో బీ ఆర్ఎస్ ది పేగు బంధమన్నారు. బీ ఆర్ఎస్ ఆవిర్భావం తరువాత పార్టీకి తొలి అధికార పదవిని అందించిన చరిత్ర నిజామాబాద్ జిల్లాదన్నారు. మళ్లీ పార్టీకి పూర్వవైభవం తేవడంలో, కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేయడంలో కూడా నిజామాబాద్ జిల్లా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు.’నిజామాబాద్ జిల్లా పంతం, ఇందిరమ్మ హింసారాజ్యం అంతం’ అనే దీక్షతో వరంగల్ బాటపడదా మన్నారు. సమైక్యాంధ్ర పాలనలో ఆర్మూర్ లో జరిగిన బీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ‘ఆర్మూర్ ప్లీనరీ పంతం, తెలంగాణ సొంతం, సమైక్య పాలన అంతం’ అనే నినాదంతో పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు వరంగల్ రజతోత్సహ మహాసభ స్ఫూర్తిగా ఆర్మూర్ నియోజక వర్గంలో ‘గులాబీ ఆర్మీ పంతం -దుష్ట కాంగ్రెస్, భ్రష్ట బీజేపీల అంతం’అనే దీక్ష చేపడదామని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సహం తెలంగాణ ఇంటి పార్టీ పండుగగా ఆయన అభి వర్ణించారు. ఓరుగల్లు పొరుగడ్డకు తండోప తండాలుగా తరలిపోయి కేసీఆర్ నాయకత్వానికి అండగా నిలుద్దామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్మూరు టూ వరంగల్ గులాబీ మయం చేద్దామని, దారి పొడవునా ‘జై తెలంగాణ,జై కేసీఆర్’ నినాదాలతో మారుమోగిద్దామని ఆయన అన్నారు.వరంగల్ పార్టీ మహాసభకు నేతలు, కార్యకర్తలు గులాబీ దుస్తులు ధరించి కదం తొక్కాలని జీవన్ రెడ్డి సూచించారు.

ఈ సమావేశంలో జడ్పి మాజీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుజీత్ సింగ్,సత్యప్రకాష్,శేఖర్,రాజేశ్వర్ రెడ్డి,వెల్మల్ రాజన్న,మచ్చర్ల సాగర్,మస్త ప్రభాకర్,పూజ నరెంధర్,ముత్యం,రజనీష్,పోల సుధాకర్,అభిలాష్,ఏజాజ్ మరియు పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!