నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 5.(షేక్ గౌస్)
నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్‌లో LP No. 15/1998, సర్వే నం. 219లో లేఔట్ ఓపెన్ స్థలాన్ని ఆక్రమించి, అనుమతి లేకుండా నిర్మించిన రేకుల షెడ్డులను మంగళవారం నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు.మునిసిపల్ అధికారులు విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, లేఔట్‌లో ఓపెన్ స్థలంగా విడిచి ఉంచిన భూమిలో అనుమతి లేకుండా రేకుల షెడ్డును నిర్మించారని గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే, అధికారుల పర్యవేక్షణలో జేసీబీ సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారని తెలిపారు.లేఔట్ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మునిసిపల్ అధికారులు హెచ్చరించారు. నగర ప్రణాళికా నియమాలను పాటించాల్సిందిగా ప్రజలకు సూచించారు.