నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:21
మహోన్నత దార్శనికుడు రాజీవ్ గాంధీ అని నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ అన్నారు.రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విపుల్ గౌడ్ మాట్లాడుతూ పిన్నవయసులో భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి టెలి కమ్యూనికేషన్స్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని ఆయన అన్నారు.ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని అన్నారు. ఐటి రంగంలో భారత్ సాధిస్తున్న అభివృద్ధి ఆయన కృషివల్లే సాధ్యమైందని ఆయన అన్నారు.బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి రాజీవ్ గాంధీ సమ సమాజ స్థాపన కోసం కృషి చేశారని ఆయన అన్నారు.ఆధునిక భావాలు కలిగిన వ్యక్తిగా అంతర్జాతీయంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం లో సుస్థిర స్థానాన్ని రాజీవ్ గాంధీ సంపాదించుకున్నారని, టెలి కమ్యూనికేషన్స్ రక్షణ వాణిజ్య విమానయాన సంస్థలలో దిగుమతి విధానాలను సంస్కరించడంతో పాటు ఆర్థిక వ్యవస్థలో అధిక విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలను ఆధునికరించడంలో ఆయన కృషి చేయడంతో నేడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ హత్య నుండి నేటి పహల్గాం ఉగ్రదాడి వరకు భారతదేశంలో ఉగ్రముకులు దాడి చేస్తున్నాయని ఉగ్రవాదం వల్ల ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు పీడించబడుతున్నాయని ఉగ్రవాదం నశించిన రోజు ప్రపంచం శాంతియుతంగా స్వేచ్ఛావాయులు పీలుస్తుందని తెలిపారు. రాజీవ్ గాంధీ వర్ధంతి రోజును ఉగ్రవాద నిరోధక దివాస్ గా జరుపుకుంటూ రాజీవ్ గాంధీకి,పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన భారతీయ పౌరులకు ఘనంగా నివాళులర్పిస్తున్నామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అనుపాల్ కిరణ్,జిల్లా ప్రధాన కార్యదర్శిలు ఆదిత్య పాటిల్,నరేందర్ గౌడ్, రషీద్,రూరల్ అసెంబ్లీ అధ్యక్షుడు మహీందర్,పట్టణ ఉపాధ్యక్షులు శుభం, అర్మూర్ సృజన్, నాయీమ్,యూత్ కాంగ్రెస్ నాయకులు నాయీమ్, అక్రమ్,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.