PSSM నవనాథపురం కమిటీ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో  ధ్యాన జ్ఞాన కార్యక్రమం

బాల్కొండ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 3 .జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రీజీ గారి జన్మదిన నవంబర్ 11 సందర్భంగా PSSM నవనాథపురం కమిటీ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో 11 రోజులు 11 మండలాలలో శాకాహార ర్యాలీలు , ధ్యాన, జ్ఞాన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు 3 వ రోజు బాల్కొండ మండల కేంద్రంలో ఆంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద ధ్యాన జ్ఞాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుమారు 500 మంది ధ్యానంలచే బాల్కొండ మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా అహింసాయుత మహాకరుణ శాఖాహార ర్యాలీని నిర్వహించడం జరిగింది.ప్రజలందరూ ధ్యానం చేయాలని శాకాహారం మాత్రమే భుజించాలని ఏ జీవిని చంపరాదని జీవహింస మహా పాపమని మానవులందరూ ప్రశాంతంగా జీవించాలంటే శాఖాహారం పూజించాలని తెలిపారు.ప్రతి ఒక్కరూ శాకాహారాన్ని భుజించి ఫిరంగిశక్తిని ఉపయోగించి ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నారు.ఈ కార్యక్రమానికి జ్ఞాన దాతగా విచ్చేసిన మహేశ్వర మహా పిరమి ట్రస్టు ప్రధాన కార్యదర్శి శ్రీ మారం శివప్రసాద్ అద్భుతమైన ధ్యాన జ్ఞాన సందేశాన్ని అందించారు.ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి శాకాహారం భుజిస్తే హాయిగా ఉంటుందన్నారఆత్మహత్యలు అదేవిధంగా nహత్యలు నిరోధించాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేసే జ్ఞానం పొందాలన్నారు.ధ్యనం చేస్తే ప్రతి ఒక్కరికి ఆలోచన శక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ ధ్యాన కార్యక్రమంలో PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, సింధూల రాజేందర్, పెంటు రాజేశ్వర్, బొడ్డు దయానంద్, సుఖాల లక్ష్మణ్, కా పెళ్లి చిన్న ముత్తన్న, అమరవాజి శ్రీనివాస్, సబ్బని సుదర్శన్, మల్లారం సాయినాథ్, పెంబర్తి నారాయణ, కాపెల్లి నర్సారెడ్డి,400 మంది ధ్యానులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!